మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం పెద్ది. ఈ చిత్రం శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు సైతం ఈ విషయం పైన నిరుత్సాహపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన భాగమంతా కూడా షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. శృతిహాసన్ స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది.



తాజాగా ఈ సినిమా జూన్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ హీరోగా నటించిన కర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన బుచ్చిబాబు అక్కడ రామ్ చరణ్ అభిమానులు అరుపులతో పోరెత్తించారు. స్పీచ్ అయిపోయి వెళ్తూ ఉండగా రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ అభిమానులు కేకలు వేయడంతో.. ఈ విషయంపై బుచ్చిబాబు మాట్లాడుతూ జూన్ 25న అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అయితున్నారు.



పెద్ది సినిమా ప్రీమియర్స్ షో విషయంలో కూడా సరికొత్త రికార్డ్స్ సెట్ చేయబోతుందనే విధంగా వినిపిస్తున్నాయి. జూన్ 24న సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ విషయం పైన మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి పెద్ది సినిమా పైన అభిమానుల అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. గత సినిమాలలో కంటే ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడినట్టుగా కనిపిస్తోంది. మరి ట్రైలర్ తో ఎలాంటి రికార్డులను పెద్ది సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: