ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇటి వలె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.. తాను మొదటిసారి ఛార్లే సినిమా చూశానని అందులో హీరోయిన్ పాత్రలో తనని తాను ఊహించుకున్నానని ఆ క్షణం నుంచే దుల్కర్ సల్మాన్ పైన తనకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందంటూ తెలిపింది. నిజంగా ఆయన్ని ఒక్కసారి కలవాలనే కోరికతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు తాను ఫిదా అయిపోతాను అంటూ తెలిపింది.
అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ నటన, స్టైల్ అంటే చాలా ఇష్టమని ఫరియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు సైతం దుల్కర్ సల్మాన్, ఫరియా కాంబినేషన్లో ఒక సినిమా అయినా రావాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం అనే చిత్రంలో నటిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ని కూడా సోషల్ మీడియాలో పరిచయం చేసింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఫరియా అబ్దుల్లా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి