అయితే ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నార్త్ ప్రాంతంలో ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారని , గతంలో బీహార్, పాట్నా వంటి ప్రాంతాలలో గేమ్ ఛేంజర్ సినిమాకి చేశారు. పెద్ది సినిమాకి ప్రమోషన్స్ ను అలానే చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జార్ఖండ్ రాంచీలో పెద్ది సినిమాను భారీ ఈవెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈవెంట్ కి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గెస్ట్ గా తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
గతంలో రామ్ చరణ్ ,ధోనీ ఎన్నోసార్లు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఆ స్నేహం వల్లే ఇప్పుడు ధోనీ ని పెద్ది సినిమా ప్రమోషన్స్ కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఈ విషయం నిజమైతే బాగుండని కోరుకుంటున్నారు. ఒకవేళ పెద్ది సినిమాకి నిజంగానే ధోనీ గెస్ట్ గా వస్తే మాత్రం నార్త్లో పెద్ది సినిమాకి మంచి హైప్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్ గా కూడా కనిపిస్తూ ఉండడంతో ధోనీ ని ఈవెంట్ కి తీసుకు వస్తే మరింత ప్రమోట్ అవుతుందని చిత్ర బృందం ఇలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి