ఆమె మంచి అందగత్తె. అభినయం వరకూ ఒకే. అయినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టాలీవుడ్లో సత్తా చాటాలనుకున్నా సరైన అవకాశాలు పలకరించలేదు. దాంతో స్టార్ హీరో పక్కన ఐటం సాంగ్ అయినా రెడీ అంటూ బాలక్రిష్ణతో ఓ చిత్రంలో మెరిసింది. ఇక అల్లరి నరేష్, గోపీచంద్ వంటి వారితో కూడా నటించింది. గ్లామర్ కి కేరాఫ్ అనిపించుకున్నా చాన్సులు మాత్రం ఎవరూ ఇవ్వడంలేదు.
దీంతో ఈ సుందరి తానే ఓ బోల్డ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. విభిన్నమైన పాత్రలు ధరించి యూత్ ని ఆకట్టుకున్న శ్రద్దాదాస్ చాలా గ్యాప్ తరువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని కల్మషం లేని హ్రుదయాన్ని కళాత్మక దృష్టి తో తెరకెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్.. స్టార్డమ్ వున్న నటీనటులు ఇలాంటి సందేశాత్మక లఘు చిత్రాలు చేస్తే సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుందనే చెప్పాలి.
బాలీవుడ్ లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ లఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ నటించటం మనకు తెలుసు.. టాలీవుడ్ లో కూడా ఇలా స్టార్స్ నటించిన సందర్బాలు వున్నాయి. మరి శ్రద్ధా దాస్ చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా అంతా ఆహ్వానించాల్సిందే. ఆమె పట్టుదలకు, అంకితభావానికి జోహార్ అనాల్సిందే. ఇక ఫ్యూచర్లో మరిన్ని న్యూ థాట్స్ తో కొత్త ప్రాజెక్ట్లులను ఈ అమ్మడు చేస్తుందేమో చూడాలి మరి.