•గురు శిష్యుల పోరు..
•టిడిపి వ్యూహం వర్కౌట్ అవుతుందా..  

•జనసేనతోనే కలిసొచ్చే అవకాశం..


ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకంగా ఉంటుంది. విశాఖ జిల్లాలోని సముద్రతీరంలో ఉండే ఈ నియోజకవర్గం  పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ పలు వ్యాపార సంస్థలతో పాటు ఎన్నో  విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా  భీముని పట్నం అసెంబ్లీ కాస్త భీమిలీగా మారింది. అలాంటి ఈ భీమిలిలో  ఇద్దరు మాజీ మంత్రులు పోటీ చేస్తున్నారు. మరి ఇందులో గెలుపు ఎవరిది..వారి బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 భీమిలిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,29,000. ఇందులో పురుషులు 1,63,000 , మహిళా ఓటర్లు 1,65,000. ఈ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీకి చెందిన సభ్యులు బలంగా ఉంటారు. 2004 నుంచి ఇక్కడ కాపు నాయకులే విజేతలుగా ఉన్నారు. 2004లో అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదటిసారి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ఇక 2019లో వైసీపీ నుంచి  అవంతి శ్రీనివాసరావు పోటీ చేసి  ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. టిడిపి, బిజెపి, జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. శ్రీనివాసరావు భీమిలిలో రెండోసారి పోటీ చేయడం చాలా ఆసక్తికరంగా మారింది.

 గెలుపోటములు :
ఇక 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ కు 1, 01,629ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టిడిపి నుంచి పోటీ చేసిన సబ్బం హరికి 91,917 ఓట్లు వచ్చాయి. ఇక ఇక్కడ ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు 24 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అలాంటి ఈ తరుణంలో భీమిలి నియోజకవర్గంలో ఈసారి టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి టిడిపి అభ్యర్థికి91 వేల ఓట్లు రాగా, వైసిపి అభ్యర్థికి లక్ష పైన ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య కేవలం 9000 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అలాగే జనసేనకు 24 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈసారి టిడిపి, జనసేన, బిజెపి కలిపి పోటీ చేస్తుంది కాబట్టి జనసేన ఓట్లన్నీ టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్ వైపు మళ్ళితే మాత్రం తప్పక ఆయన విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: