అవునూ.. ఓ చిన్న సినిమా ఇటీవల కాలంలో డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇంతకీ ఆ సినిమా ఏది? అసలు ఆ సినిమా ఏ జోనర్? హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎపుడు రిలీజ్ అయింది? ఏ ప్లాట్ ఫాం ద్వారా రిలీజ్ అయింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
కథ:
హాస్పటల్ లో రిషి (రాకేష్)స్పృహలోకి వచ్చాక డాక్టర్ అతనికి ఓ సీరియస్ విషయం చెప్తాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల అమ్నీషియా (మెమెరీ లాస్) వచ్చిందని వివరిస్తాడు.అలాగే హాస్పటిల్ లో అతన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అతని గర్ల్ ప్రెండ్ అదితి (పూజిత కూరపాటి) చెప్తాడు. అయితే రిషి తన గర్ల్ ప్రెండ్ ని సైతం గుర్తులేదంటాడు. కానీ ఆమె ఆదరణ,ప్రేమ చూసి ఆమె సాయంతో తన గతం గుర్తు చేసుకుందామనుకుంటాడు. ఆ తర్వాత డిఛ్చార్జ్ అయ్యాక..అతని తల్లితండ్రుల గురించి అడుగుతాడు. అదితి అప్పుడు అతని తల్లి ఎప్పుడో చనిపోయిందని, తండ్రి మాత్రం అతని కోసం ఉన్నాడని చెప్తుంది. దాంతో తన తండ్రిని కలుద్దామని అదితిని తీసుకుని బయిలుదేరుతాడు రిషి. అప్పుడు మార్గం మద్యలో కారు ఆగిపోవడం.. ఒక దగ్గర ఆగడం వంటివి జరిగిపోతాయి. అక్కడి నుండి కథలో ట్విస్టులు మొదలవుతాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా.
రివ్యూ:
మొత్తం మీద థ్రిల్లర్ మూవీ గా మొదలై, సైకో థ్రిల్లర్ జానర్ ని టచ్ చేస్తూ సినిమా ఉన్నంతలో చాలా బాగా ఆకట్టుకుంది, గట్టిగా చెప్పాలి అంటే రీసెంట్ గా థ్రిల్లర్, సైకో థ్రిల్లర్స్ అంటూ డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న చాలా పెద్ద సినిమాల కన్నా కూడా బెటర్ మూవీ ఇది. ఫస్ట్ 10- 15 నిముషాలు కూర్చుంటే మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ ఈజీగా అవుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది, లెంత్ తక్కువ అయినా ఎంగేజింగ్ బ్లాక్స్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పాలి. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీస్ ని, సైకో థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారిని కచ్చితంగా మెప్పిస్తుంది ఈ సినిమా, రొటీన్ మూవీస్ చూసే వాళ్ళని కూడా ఈజీగా ఒకసారి చూసేలా చేస్తుంది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండానే సినిమా చూస్తారు కాబట్టి మొత్తం అయ్యాక ఇతర రీసెంట్ థ్రిల్లర్స్ తో పోల్చితే చాలా బెటర్ గా ఉందనిపించడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: