మీరు చదువుతున్నది నిజమే. ఏమాత్రం సందేహం లేదు... ఈ బొత్స ఆ బొత్స ఒక్కటే. మన రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొడుకు. బొత్స రంజిత్... బొత్స సత్యనారాయణ, ఝాన్సీల కుమారుడు. వాళ్ల నాన్నగారు పరోక్షంగా సినీపరిశ్రమలో ఉండటం వల్ల కావచ్చూ... తెరవెనుక నిర్మాతగా భారీ చిత్రాలను నిర్మిస్తున్న కారణమైనా కావచ్చు... రంజిత్ కుమార్ హీరోగా అయిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే, ఏడాది కిందటి నుంచీ కసరత్తు మొదలుపెట్టాడు. డైలాగులు చెప్పడమూ డాన్సులు చేయడమూ ఫైట్లు చేయడమూ నేర్చుకున్నాడట. అన్నీ వచ్చేశాయనుకున్నాక ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పేరు అయిదుగురు. దీనికి గూడూరు అనిల్ దర్శకుడు. ఇతడెవరంటే.. శేఖర్ కమ్ముల దగ్గర పనిచేశాడు. ఈ సినిమాకు పాటలతోపాటు మాటలు కూడా రాస్తున్నారు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఇందులో మరో విశేషం ఏంటంటే... మహేష్ బాబు కజిన్ సిద్ధార్థ్ ఇందులో మరో పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: