సినిమా హీరోయిన్లకు ఉన్న ప్లస్ పాయింటే ఇది. టైమ్ బాగుంటే వరుస సినిమా అవకాశాలు వస్తాయి. బోలెడు డబ్బులు వస్తాయి. అవకాశాలు రాకపోతే... వాళ్లే అవకాశాలను సృష్టించుకుంటారు. అలాగే సృష్టించుకుంటోంది సంజన.
బుజ్జిగాడు చిత్రంలో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ సంజన. ఆ తరవాత పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో, భవిష్యత్ ప్రణాళికమీద దృష్టిపెట్టింది. అదేంటంటే... మరో సెలెబ్రిటీతో కలిసి తిరిగితే ఏదైనా కలిసి రాకపోతుందా అన్న ఆలోచన. దాంతో విరాట్ కోహ్లీ మీద దృష్టిపెట్టింది. వీళ్లిద్దరికీ ఎలా కుదిరిందీ అంటారేమో? సంజన కన్నడ భామ. కోహ్లీ బెంగళూరు ఐపీల్ జట్టులో ఉన్నాడు. ఈమాత్రం బీరకాయ పీచు సంబంధం చాలదా అల్లుకుపోవడానికి. అలాగే కోహ్లీని పట్టుకుంది ఈ గుమ్మడు. విరాట్ ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లిపోయేది.
ఇటీవల విరాట్ హైదరాబాద్ లో షూటింగ్ కి వస్తే.. విరాట్ తోనే తిరిగిందట. ముంబై వెళ్తే అక్కడకూ వెళ్లపోయిందట. ఇలా కోహ్లీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటూనే మా మధ్య ఎలాంటి సంబంధమూ లేదంటోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: