టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. ప్రస్తుతం తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ లో సేదదీరుతున్న ఆమె, ఈ ఉదయం ఆరు గంటలకు మరణించారు.
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అయితే ఇండస్ట్రీలో చిన్న పాత్రల్లో నటిస్తున్న ఆయనకు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు ఆదరించి మంచి హిట్ సినిమాలు అందించారు. అందుకే ఇప్పటికే మోహన్ బాబు ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు తన గాడ్ ఫాదర్ అని..ఆయన లేకుండా తన జీవితమే లేదని అంటుంటారు. ప్రస్తుతం ఆయన వారుసులు మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ తన అన్నలాంటి వారని..ఎన్నో చిత్రాల్లో తనకు పాత్రలు ఇచ్చి ఆదుకున్నారని అంటారు. తాజాగా ఆయన మాతృమూర్తి కన్నుమూత సమయానికి విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:
manchu mohan babu
mother
manchu laxmamma
pass away
tirupathi
vidya nekhatan
ap political updates
telangana politics
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
mallywood
hollywood news
latest film news
latest updates