
ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ సహా కౌంటింగ్ వరకు ఏం జరగబోతుంది అనే విషయం గురించి అందరూ సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. అయితే జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే అటు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో.. ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక కౌంటింగ్ సమయంలో జరిగే కొన్ని అనూహ్యమైన ఘటనలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న అభ్యర్థి విజేతగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇలా గెలిచిన అభ్యర్థికి ఇక గట్టి పోటీ ఇచ్చిన మరో అభ్యర్థిని టాప్ 2 గా ప్రకటించడం చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఇలా ఎన్నికల కౌంటింగ్ లో టాప్ 2 లో నిలిచిన ఇద్దరు అభ్యర్థులకు కూడా ఓట్లు సమానంగానే వస్తే ఏం చేస్తారు అనే విషయం దాదాపు ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చి విజేత ఎవరు తేల్చలేని పరిస్థితి నెలకొంటే డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారట ఎన్నికల అధికారులు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 102 ఈ అవకాశాన్ని కల్పించిందట. ఈథర్ అందుకోసం ముందుగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుంది. 2019లో రాజస్థాన్లో, 2017లో ముంబైలో ఇలాగే ఫలితం తేలింది అని చెప్పాలి.