సినీ జక్క‌న్న రాజమౌళి చెక్కుతున్న మరో శిల్పం ఆర్ ఆర్ ఆర్  విశేషాలు ఇపుడు చాలా ఇంటెరెస్టింగ్ గా ఉంటున్నాయి. ఈ మూవీలో హీరోలు ఇద్దరు సూపర్ స్టార్లు. మరి వారి జోడీలు ఎవరో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది. తారక్. చరణ్ ల సరసన నటించే అందాల భామలు ఎవరు అన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది.


ఇదిలా ఉండగా ఓ న్యూస్ ఈ సినిమా గురించి ఇపుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆలియాభట్ అనే బాలీవుడ్ భామ ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తోందని. ఆమెను రాజమౌళి హీరోయిన్ గా తీసుకుంటున్నారని వైరల్ అవుతోంది.ఈ మేరకు  అలియాను ఆర్ ఆర్ ఆర్లోకి తీసుకోవాలనే ఆలోచన జక్కన్న చేస్తున్నట్టు ముంబై మీడియా రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెని యూనిట్ సంప్రదించినట్టు టాక్. ఈ విషయాన్ని అలియా ఫ్రెండ్ ఒకరు మీడియాకి తెలిపాడు.


ఫిల్మ్‌మేకర్ కరణ్‌జోహార్ రిక్వెస్ట్‌తో అలియాను సంప్రదించినట్టు ఇంకోవైపు ప్రచారం సాగుతోంది. గతంలో పరిణీతిచోప్రా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలియా వంతైంది. వీళ్లలో జక్కన్న ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలి. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్  ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. చెర్రీ, తారక్‌, సముద్రఖనిపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరి ఆలియాభట్ కనుక ఈ మూవీలో ఉంటే కెవ్వు కేకేనని అంటున్నారు. ఈ సుందరి తో ఈ మూవీ అంచనాలు పీక్స్ చేరుకుంటాయని కూడా చెబుతున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: