ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ని ఎదుర్కోలేక.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. జనసేన, బిజెపి లతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే టిడిపి తనకు అనుకూలంగా ఉంటుందని.. బిజెపిని తనలో కలుపుకుంది .. కానీ బీజేపీ వ్యూహం వేరే ఉందని తేటతెల్లమవుతోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు బిజెపితో తన ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నారు.. ఎందుకంటే మోడీ పేరు మీద కొన్ని ఓట్లు వస్తాయి.. ఇంకొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు కలుపుకుంటే ఎన్నికల సంఘంతో అనుకూలంగా పనిచేయించుకోవచ్చు అనే నమ్మకం.. ఇందులో భాగంగా నే ఎన్నికల సంఘంతో పని చేయించుకుందాం .. కేంద్ర ప్రభుత్వంతో మనకు అనుకూలంగా పనిచేయుచుకుందాం.. అని టీడీపీ అనుకుంది.


ఎలా అంటే జగన్ కి  అనుకూలంగా ఉన్న వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడం అన్నట్టు.. మొత్తం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొస్తూ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి , డీజీపీ లను తీసేయాలని.. 25 మంది ఐపీఎస్ లు,  కలెక్టర్లు అందర్నీ తీసేయాలని.. అయితే వీరి ప్రయత్నం ఫలించలేదు. ఒక నలుగురిని మాత్రమే తీసేయగా.. మరో ఇద్దరినీ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే పానల్ కి సంబంధించి వీరు కోరుకున్నటువంటి వారు రాలేదు.. అంతేకాదు జగన్ కు చాలా అనుకూలంగా ఉన్న వారిని కూడా మార్చేయాలని టిడిపి  ఒత్తిడి తీసుకొస్తోంది. ఎందుకంటే వీరికి కావాల్సిన పనులు జరగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ను మార్చాలని టిడిపి ఎంత ప్రయత్నించినా.. వీరి ప్రయత్నాన్ని బిజెపి తిప్పి కొట్టింది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుకూలంగా పదవీ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేసింది. ధర్మా రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పొడిగించిన 2 రెండేళ్ల పదవీకాలం ఏడాది మే 14వ తేదీకి ముగియబోతోంది.. జూన్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.లెక్క ప్రకారం మే 14వ తేదీన కేంద్ర సర్వీస్ కి ఆయన తిరిగి  వెళ్ళిపోవాలి.


 కానీ ధర్మారెడ్డికి సంబంధించి జగన్.. జూన్ 30న పదవీ విరమణ చేసేంతవరకు డెప్టేషన్ పొడిగించాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖ రాస్తే.. మే జూన్ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. దర్శనానికి 30 గంటలకంటే ఎక్కువ సమయం పడుతుంది.. అన్ని గంటలపాటు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తారు. వారికి ఆహార, వసతి, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.. ఇవన్నీ సర్దుబాటు చేయాలి అంటే ధర్మారెడ్డి పదవీకాలం పొడిగించాలి అంటూ జగన్ లేఖ రాయగా బిజెపి ఈ నిర్ణయానికి అంగీకరించింది.. మొత్తానికి అయితే మరో 46 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించడంతో టీడీపీకి మోడీ ప్రభుత్వం భారీ ట్విస్ట్ ఇచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: