గోవాబ్యూటీ ఇలియానాపై టాలీవుడ్ మండిపోతోంది. తెలుగు దర్శకనిర్మాతలు ఈ భామకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. దాదాపుగా ఇలియానాపై అనఫీషయల్ బ్యాన్ రన్ అవుతున్నట్టే కనిపిస్తోంది. దీనికి కారణం ఇలియాన వ్యవహార శైలియే. ఇలియానాను స్టార్ హీరోయిన్ చేసిన టాలీవుడ్ పై ఇలియానా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దర్శకనిర్మాతలు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
సినిమా కంప్లీట్ అయిన తర్వాత నటీనటులు సదరు సినిమా ప్రమోషన్లో పాల్గొనాలి. స్టార్ హీరోలు సైతం ప్రమోషన్ కోసం అవసరమైతే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళతారు. కానీ ఇలియానా ఇందుకు విరుద్ధంగా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. టాలీవుడ్ లో కొంత గ్యాప్ తర్వాత ఈ మధ్య ‘జులాయి’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాల్లో నటించింది. ఒక్కసారి షూటింగ్ పూర్తయ్యిందంటే ఈ భామ సదరు సినిమా గురించి ఏ మాత్రం పట్టించుకోదని ఆమెతో పనిచేసిన దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రానికి సంబంధించిన ఎటువంటి ప్రచార కార్యక్రమాలకు ఇలియానా వెళ్లలేదు. ‘జులాయి’ ఆడియో వేడుకకు కూడా ఈ భామ డుమ్మా కొట్టింది. దీంతో ఇలియానా బాధ్యతారాహిత్యం పట్ల దర్శకనిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు సైతం ఆమె పై అప్పుడు మండిపడ్డారు. అలాగే అల్లు అర్జున్ సైతం ఇక తాను ఇలియానాతో చేయనని నిర్ణయించుకున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ ఇల్లీని తను పవన్ తో చేయబోయే సినిమాలోనూ తీసుకుంటాడని వినిపించింది. ఇప్పుడు అది కూడా విరమించుకున్నాడని తెలుస్తోంది. జులాయి ఓకే అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు.
సాధారణంగా మంచి సక్సెస్ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది. దీనికి తోడు సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం తెలుగు మూవీ మేకర్స్ ను మరింతా ఇబ్బందికి గురిచేశాయి. బాలీవుడ్లో కొన్ని ఆఫర్లు రాగానే టాలీవుడ్ ను ఇలియానా లైట్ గా తీసుకుంటుందనే ఆరోపణలూ వస్తున్నాయి.
అందుకే ఇలియానాకు తెలుగు దర్శకనిర్మాతలు ఛాన్స్ లే ఇవ్వడం లేదు. ఇల్లీ బేబి ఇలాగే వ్యవహరిస్తే ఆమెపై టాలీవుడ్ పరిశ్రమ ఆఫీషియల్ గా బ్యాన్ విధించినా ఆశ్చర్యం లేదంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: