ఇప్పుడు తెలుగులో సరికొత్త కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు సుకుమార్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమాను రూపొందించడానికి సుకుమార్ ఇప్పటికే కథ ను సిద్ధం చేశాడని, తెలుగులో ఇప్పటి వరకూ రానటువంటి పూర్తి విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించనున్నారని అంటున్నారు. చేసింది కొన్ని చిత్రాలే అయినా దర్శకుడు సుకుమార్ ది ఓ ప్రత్యేక శైలి. ఆర్య, 100 % లవ్ .. వంటి సినిమాలు ఇందుకు ఉదాహారణ. హీరో జూనియర్ ఎన్టీఆర్ ది ఇందుకు విరుద్ధమైన శైలీ. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: