అమెరికాలో కరోనా పంజా విసురుతోంది. ఇంటి నుంచీ బయటకి వస్తే వారి సంగతి ఇక దేవుడికే ఎరుక. ఎక్కడి నుంచీ వస్తుందో తెలియదు కానీ బయటకి వచ్చిన వారిలో ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అమెరికాలో కొద్ది రోజుల క్రితం వరకూ కూడా భారతీయ ఎన్నారైల కరోనా పాజిటివ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు...మృతుల సంఖ్య కూడా ఎంతో తక్కువగానే నమోదయ్యింది. దాంతో భారతీయులు అందరూ క్షేమంగానే ఉన్నారని అనుకున్నారు..కానీ

IHG

ఊహించని పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. ఒక్క సారిగా 1500 భారతీయులు కరోనా బారిన పడ్డారు. దాదాపు 40 మంది భారతీయులు మృత్యు వాతపడ్డారు. మిగిలిన వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారుని భారతీయ సంఘాలు తెలిపాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం 1500 మందిలో దాదాపు 1000 మంది న్యూయార్క్ కి చెందిన వారు కాగా 400మంది న్యూజెర్సీ కి చెందిన వారని మిగిలిన వారు వివిధ ప్రాంతాలకి చెందిన వారనితెలిపారు.

IHG

వీరిలో చాలామంది అక్కడే ఎన్నో ఏళ్ళ క్రితం స్థిరపడిన ఇండో అమెరికన్స్ కాగా మిగిలిన వారు ఎన్నరైలు గా గుర్తించారు. ఇదిలాఉంటే న్యూయార్క్ , న్యూజెర్సీ ప్రాంతాల నుంచీ అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ప్రాంతాలలోనే తెలుగు వారు అత్యధికంగా ఉండటం కూడా గమనార్హం. అయితే మృతి చెందిన వారిలో సుమారు 17 మంది కేరళా కి చెందిన వారు కాగా మిగిలిన వారు ఒడిసా , ఏపీ, గుజరాత్ రాష్ట్రాల వారు ఉన్నట్టుగా తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: