కరోనా సోకితే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటై కి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తూ కరోనా నెగిటివ్ వచ్చే వరకూ అక్కడే ఉంచుతారు. అయితే ఈ పరిస్థితి అందరికి సెట్ అవ్వదు. ఎందుకంటే కరోనపై విజయం సాధించాలంటే ముందుగా మానసికంగా ధృడంగా ఉండాలి. అప్పుడే కరోనపై తొలి విజయం సాదించినట్టే. మరి ఇంట్లోనే ఉంటూ కరోనాపై విజయం సాధించావచ్చా అంటే అవుననే అంటున్నారు లండన్ లో ఉంటున్న తెలుగు ఎన్నారై దంపతులు..ఆ వివరాలు మీ కోసం..

IHG

ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే వారు ఇంట్లోనే ఉంటూ భారతీయ ఆయుర్వేద పద్దతులని పాటించి విజయం సాధించారు. లండన్ లో ఉంటున్న డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి రావు దంపతులు ఎన్నో ఏళ్ళ క్రితమే లండన్ వెళ్ళారు. వృత్తి రీత్యా డాక్టర్ కావడం పైగా సైకాలజీ డాక్టర్ కావడంతో కరోనాపై సులువుగా విజయం సాధించారు. ఆయన భార్య హేమ కి కరోన పాజిటివ్ 6 వారాల క్రితం వచ్చింది అయితే ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోమని లండన్ వైద్యులు సూచించడంతో ఆమెకి ధైర్యం చెప్తూ హోమ్ క్వారంటైన్ లో ఉంచి వైద్యం చేయడం మొదలు పెట్టారు నిమ్మగడ్డ శేషగిరి రావు.

 

తమ పిల్లలని వేరే గదిలో ఉంచి..భార్యకి సేవలు చేస్తున్న సమయంలోనే ఆయనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా కంగారు పడలేదు. అయన భార్యకి డయాబెటిస్ తో పాటు హైపర్ టెన్షన్ కూడా ఉంది. దాంతో ఆమెని ముందుగా మానసికంగా ధృడంగా ఉండేలా చేశారు. సైకాలజీ డాక్టర్ కావడంతో ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. భార్యకి కరోన సోకిన తరువాత ముందుగా ఒళ్ళు నెప్పులు రావడం , ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం మొదలయ్యాయి..దాంతో ఇద్దరూ కరోనా పై మనం విజయం సాధించాలని నిశ్చయించారు ఈ క్రమంలోనే..

 

తమ స్నేహితులతో మాట్లాడటం, సదరాగా ఉండేలా ప్లాన్ చేసుకుని ధైర్యం చెప్పుకునే వారు.         జ్వరానికి దగ్గుకి మందులు వేసుకునే వారు. రోజుకి రెండు సార్లు గోరు వెచ్చని ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఊసేవారు. భార్యకి యాంటిబయోటిక్ వాడేవారు ఎందుకంటె ఆమెకి అనారోగ్య సమస్యలు ఉండేవి కాబట్టి. ఇదిలాఉంటే పసుపు, అల్లం, మిరియాలు వేసి ఓ కషాయాన్ని తయారు చేసుకుని ఇద్దరు కలిసి త్రాగేవారు.

 

నీటిలో నిమ్మకాయ కలుపుకుని రోజంతా ఆ నీటిని త్రాగేవారు, ఇమ్మ్యునిటీ పెంచే మాత్రలు, జింక్ , విటమిన్ ట్యాబ్లెట్లు వాడేవారు.కరోనా శరీరంలో ప్రవేశిస్తే శక్తిని మొత్తం లాగేస్తుంది కాబట్టి శరీరానికి ఆహరాన్ని అందించే వారు అన్నం తినాలేక పోయినా సరే బలవంతంగా అయినా తినే వారు..చారు కాచుకుని అందులో వెల్లుల్లి , జీలకర్ర వేసుకుని త్రాగేవారు. ఈ క్రమంలో దగ్గు పెరుగుతూ వచ్చింది అయినా తమ రోజు వారి పద్దతులని పాటించే వారు, పిల్లలని దగ్గరకి రాకుండా చూసుకునే వారు, విపరీతంగా వచ్చే దగ్గు 11 వ రోజు వచ్చే సరికి తగ్గుముఖం పడుతూ వచ్చింది. 14 వ రోజున పూర్తిగా తగ్గిపోయింది. అయితే కరోనా వలన ఊపిరి తీసుకోలేని సమయంలో ఆసుపత్రికి వెళ్ళచ్చు కానీ ఈలోగా ఇంట్లో ఉంటూనే ఈ పద్దతులు పాటిస్తే కరోనా తగ్గుతుందని తమ అనుభవాన్ని వెల్లడించారు..కరోనాని జయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: