అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం ఆసన్నమైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు సమయం దగ్గరపడే కొద్దీ డొనాల్డ్ ట్రంప్ కు రోజుకో షాక్ తగులుతుంది. ఇప్పటికే ఓ సర్వే జరగగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రంప్ ఓడిపోవడం ఖాయం అని ఆ సర్వే చెబుతోంది. 

 

IHG'organised hate' policy ...


 
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ ను నియంత్రించలేకపోవడం లాంటివి ట్రంప్ కు వ్యతిరేకంగా మారాయి. అయితే ట్రంప్ రేటింగ్ అన్ని గ్రూపుల్లోనూ గణనీయంగా పడిపోతోందని ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వే గలితాలు చూసి పట్టుకున్న ట్రంప్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది.               

 

IHG

 

ఆ షాక్ ఏంటి అంటే? ట్రంప్ ఎలక్షన్ ప్రకటనలను ఫేస్ బుక్ తీసేసింది. అంతేకాదు.. ట్రంప్ ప్రకటనలు వ్యవస్దకు వ్యతిరేకంగా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ చెప్పుకొచ్చింది. అయితే గొడవలకు దారి తీసే నాజీ జర్మనీ సింబల్ ఉపయోగించినట్టు.. అందుకే ఫేస్ బుక్ బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. 
 

IHG

 

వివాదాస్పద సంస్దలను, భావజాలాలను సూచించే చిహ్నాలను మేము అనుమతించమని ఫేస్ బుక్ సెక్యూరిటీ ఆఫీసర్ నాథనియల్ గ్లీచెర్ తెలిపారు. అయితే అలాంటి ప్రకటనలు , అలాంటి చిహ్నాలు ఎవరు ఉపయోగించినా యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: