ట్రంప్ కి అమెరికన్ వ్యాపార దిగ్గజాలు నుంచి గట్టి దెబ్బ తగిలింది అనే చెప్పాలి. అమెరికన్ కంపెనీలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించి హెచ్ వన్ బీ వీసాలతో సహా వర్కింగ్ విషయాలపై ప్రభుత్వం విధించిన నియంత్రణలను ఎత్తి వేయాలని కోరారు. అయితే అమెరికా లో పనిచేస్తూ ఉండే వేలాది ప్రొఫెషనల్స్, ఉద్యోగుల వీసాలు నిలిపివేత నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికన్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగు చేయడంలో కీలకమైన ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్స్, డాక్టర్లు, నర్సులు ఇలా వివిధ రంగాల్లో పని చేసే వాళ్ళకి ఇది ప్రతిబంధకమని అంటున్నారు.
చట్ట విరుద్ధ వలస నియంత్రణలను రద్దు చేయాలని యూఎస్ పారిశ్రామిక వేత్తలు, కంపెనీ అధిపతులు కోరుతున్నారు. ఈ వీసా నియంత్రణపై అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వాణిజ్య సంఘాలు ఆగ్రహం తో ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ దనోహు అన్నారు.
జూన్ 22న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం సృష్టించాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తో అన్ని రంగాల్లో ఉన్న అమెరికా వ్యాపారాలకు హాని కలుగుతుందని దావాలో ఫిర్యాదు చేశారు. తాను అద్యక్షతన మించిపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు కనుక అమలు చెయ్యకూడదని ఫెడరల్ విభాగాలు, అధికారులు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ తిరిగి అభివృద్ధి చెందడానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు ఎన్‌ఏఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ కాన్సుల్ లిండా కెల్లీ. అలానే ఈ వీసా నియంత్రణలతో అమెరికా నుంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఇతర దేశాలు ఆకర్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి