మన దేశం నుంచి అమెరికా వెళ్లి ఎందరో స్థిరపడ్డారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుని అక్కడ భవిష్యత్తుని వెతుక్కున్న నేతలు ఎందరో ఉన్నారు.  అమెరికా మీద చాలా మంది ఆశతో ఉన్న వాళ్ళు ఎందరో అక్కడికి వెళ్లి స్థిరపడే ప్రయత్నం చేసారు. ఉద్యోగాలు, విద్య విషయంలో చాలా మంది అమెరికా మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. అయితే ఇప్పుడు మాత్రం అమెరికాలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేక చాలా మంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇక్కడి తల్లి తండ్రులు కూడా వారికి డబ్బులు పంపించలేని పరిస్థితి ఉంది నే చెప్పాలి.

ఇక ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన ఎన్నారై లకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ  ముందుకు రావడం లేదట. అమెరికాలో స్థిరపడటం చూసి చాలా మంది  అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే వారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడికి వెళ్ళిన చాలా మంది రోడ్డున పడటం ఉద్యోగాలు లేక ఇండియా నుంచి డబ్బులు  పంపించడంతో  ఆర్ధిక భారం ఇక్కడి వారికి కూడా పెరుగుతుంది. ఎన్నారైలు చాలా మంది ఇండియా వచ్చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనితో పిల్లను ఇవ్వొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఇక పిల్లలను విదేశాలకు పంపించి చదివించే  ప్రయత్నం కూడా చాలా మంది చేయడం లేదు. యూరప్ దేశాల  విషయంలో సానుకూలంగానే ఉన్నా సరే ఇతర దేశాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమెరికా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. చాలా వరకు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదవాలి అనే ఆలోచన కూడా చాలా మంది విరమించుకున్నారు. ఇక అక్కడి ప్రభుత్వాలు కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: