కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు కేంద్ర సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది ఏంటీ అనేది అందరిలో కూడా ఒకరకమైన ఆసక్తి అనేది ఉంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్రాలు సిద్దం కావాలని కేంద్రం చెప్పినా సరే దాని నిల్వ అనేది కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది అనే విషయం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ నిల్వ విషయంలో మన దేశం మూడు దేశాల సహకారం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

వ్యాక్సిన్ నిల్వ కోసం అమెరికా, జర్మని, క్యూబా, బ్రిటన్ దేశాల సహకారం భారత్ తీసుకునే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ కసరత్తు కూడా మొదలు పెట్టింది అని జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పుడు కేంద్రం అన్ని రాష్ట్రాల  సిఎం లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరికొన్ని వార్తలు ఏంటీ అంటే మైనస్ 70 డిగ్రీల వద్ద దాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.

ఇప్పటికే అమెరికాతో చర్చలు మొదలు పెట్టింది కేంద్రం. ఇక బ్రిటన్ సహా కొన్ని యూరప్ దేశాలతో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. మరి వాళ్ళు ఏమంటారు అనేది చూడాలి. ఇక మన దేశంలో ముందుగా ప్రాధాన్యత ఆధారంగా చూస్తే దాదాపుగా 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. పోలీసులకు, నర్సులకు, వైద్యులకు, మెడికల్ షాపు నిర్వాహకులకు ఇలా కొంత మందికి ఇవ్వడానికి కేంద్రం ప్రణాలికలు సిద్దం చేసుకుని ముందుకు వెళ్తుంది. మరి ఈ విషయంలో ఎలాంటి ముందు అడుగు పడుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: