ఈ అంశాలను ఇప్పుడు కొన్ని దేశాలు అంతర్గత సమస్య కూడా భావిస్తున్నాయి. అయితే వైద్యరంగం విషయంలో కొన్ని దేశాల్లో ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. ప్రధానంగా భారతదేశం విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విదేశీ వైద్యుల అవసరం భారత్ కు ఎక్కువగా ఉంది అని కొంతమంది చెబుతున్నారు. భారత్ లో వైద్య రంగంలో చాలా మంది కరోనా వైరస్ కారణంగా భయపడి ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో వైద్య రంగంలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి.
అయితే మన దేశంలో నిపుణులు ఎక్కువగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు చైనా నుంచి కొంత మంది వైద్యులను మనదేశంలో రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. అలాగే యూరప్ దేశాల నుంచి కూడా మన దేశానికి కొంతమంది వైద్యులు వచ్చే అవకాశం ఉందని కూడా టాక్. కొన్ని దేశాల నుంచి వైద్యులు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వైద్య రంగంలో కూడా ఇతర దేశాల సహకారం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర అలాగే ఢిల్లీ వంటి కీలక నగరాల్లో వైద్యులు రాజీనామాలు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలను నుంచి తప్పించుకోవాలంటే సీనియర్ వైద్యనిపుణులను దించాలని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి