ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్ద సమస్యగా మారాయి. చంద్రబాబు నాయుడు పార్టీని ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని భావించినా... ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా బలమైన నేతల అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు మీద ఆధారపడుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీకి ఎన్నారైల నుంచి ముందు నుంచి మద్దతు ఉంది. చంద్రబాబునాయుడు హైటెక్ సిటీ కట్టిన తర్వాత చాలా మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ప్రధానంగా అమెరికా వెళ్లి స్థిరపడి భారీగా ఆస్తులు సంపాదించిన వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఆధారపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలని భావించిన వాళ్లకు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్లకు ఎమ్మెల్సీ పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఆఫర్లు కూడా ఇస్తున్నారు అని సమాచారం.

దీనికి సంబంధించి టీడీపీ కీలక నేతలు మాట్లాడుతున్నారని ఎన్నారై సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత కొంత మంది ఆసక్తి చూపిస్తున్నారని కూడా సమాచారం. అయితే ఎవరు వస్తారు ఏంటనేది తెలియకపోయినా గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన దాదాపు 10 మంది ఎన్నారైలు ఇప్పుడు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఇప్పటి నుంచి రంగంలోకి దిగడానికి మార్గం సుగమం చేసుకున్నారు అని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు వరకు ఉన్నారని సమాచారం. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: