ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత  నుంచి అటు మహిళలు ఎంత అణిచివేతకు గురవుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామని ఉద్యోగాలు కూడా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తాలిబన్లు తెలిపారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంలో మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని అంటూ మాయ మాటలు చెప్పారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం తాలిబన్లు అసలు రంగు బయట పెడుతూ మహిళలు అందరినీ కూడా బానిసలుగా మార్చేసుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే మొన్నటివరకు ప్రజాస్వామ్య పాలనలో ఎంతో స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపిన మహిళలు ఇక ఇప్పుడు బానిసలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మహిళలు కనీసం చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి కూడా వీలు లేదు అంటూ ఆంక్షలు విధించి ఇంటికే పరిమితం చేశారు తాలిబన్లు. ఇక రాను రాను అన్ని రంగాల నుంచి కూడా మహిళలను తొలగిస్తున్నారు. చివరికి రోడ్డుపై పెట్టే బొమ్మలు సైతం ఆడవారి కి సంబంధించినవి ఉండకూడదు అంటూ తాలిబన్లు పైశాచిక రూల్స్ తెరమీదకు తీసుకువచ్చారు. అయితే కొంతమంది మహిళలు తాలిబన్ల క్రూరత్వానికి భయపడి సైలెంట్గా ఉండి పోతున్నారు.


 కానీ మరికొంతమంది మహిళలు మాత్రం ఏకంగా తాలిబన్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడం గమనార్హం. తమకు విద్య ఉద్యోగ హక్కు ఉందని తాలిబన్లు ప్రభుత్వం వాటిని మళ్లీ పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఉద్యమం చేస్తూ రోడ్ల మీదికి వస్తున్నారు. ఈ క్రమంలోనే  ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో యూనివర్సిటీ ముందు 20 మంది మహిళలు నిరసన చేపట్టారు. మహిళా హక్కులు మానవ హక్కులు కావాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అయితే వీరి పట్ల అటు తాలిబన్లు దారుణంగా వ్యవహరించారు. ఏకంగా మహిళలని కూడా చూడకుండా పెప్పర్ స్ప్రే ని వినియోగించారు తాలిబన్లు. ఇలా చేయడం దారుణం అంటూ మహిళలు ఎదురుతిరిగి మాట్లాడడంతో ఏకంగా తాలిబన్లు తుపాకులు చూపించి మరి బెదిరించారు. ఇక పెప్పర్ స్ప్రే కారణంగా ఎలర్జీ బారిన పడిన ఎంతోమంది మహిళలు  ఆసుపత్రుల బారిన పడటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: