రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంత తీవ్రస్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ అటు రష్యా మాత్రం ఉక్రెయిన్ పై వరుసగా దాడులతో విరుచుకుపడుతూనే  ఉంది. అయితే రష్యా తో పోల్చి చూస్తే ఉక్రెయిన్ సైన్యం ఆయుధ సంపత్తి కూడా చాలా తక్కువే. అయినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకుంటూ ఉక్రెయిన్ సైన్యం ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఉండటం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రానున్న రోజుల్లో ఎక్కడ వరకు దారి తీస్తోంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.


 ఇక ఉక్రెయిన్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాల మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ట్లుగా అటు ఉక్రెయిన్ పై అగ్ర దేశమైన రష్యా దాడి చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో దేశాలు రష్యా తీరుపై విమర్శలు చేయడమే కాదు కఠిన ఆంక్షలు కూడా విధిస్తూ ఉండడం గమనార్హం. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో కేవలం సైనికులు మాత్రమే కాదు ఉక్రెయిన్ పౌరులు సైతం దేశం కోసం ఆయుధాలు చేతబట్టి పోరాటానికి సిద్ధమవుతున్నారు.


 ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. వృద్ధులు యువకులు మహిళలు రాజకీయ నేతలు  ప్రస్తుతం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యారు. యుద్ధం లో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఆయుధాలు ఇస్తామంటూ అధ్యక్షులు జెలెన్ స్కి ప్రకటన చేసిన నేపథ్యంలో ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడూ నేటి ఉద్యోగులు సైతం తాము దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధం అంటూ ముందుకు వచ్చారు. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ లోకి రష్యన్ సైనికులు వస్తే ఇక అంతు చూస్తమంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: