మొన్నటి వరకు రష్య ఉక్రెయిన్ కి మధ్య జరిగిన యుద్ధం ఎంత తీవ్ర రూపం దాల్చినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా నెల రోజులకు పైగా జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. అయితే అటు తక్కువ సైన్యం ఉన్నప్పటికీ రష్యా సేనలతో ఉక్రెయిన్ సైన్యం ఎంతో వీరోచితంగా పోరాటం చేసింది. దీంతో ఇక దాదాపు నెల రోజుల యుద్ధం తర్వాత రష్యా సేనలు ఇటీవల తురుగు ముఖం పట్టాయి అన్న విషయం తెలిసిందే. దీంతో యుద్ధం మొత్తం సమసిపోతుంది అని అందరూ అనుకున్నారు.


 ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అని భావించారు. ఇలాంటి సమయంలోనే మళ్లీ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్ నుంచి తిరుగు ప్రయాణమైన రష్యా సేనలు మరో వైపు నుంచి దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి అన్న వార్తలు సంచలనంగా మారిపోయాయ్. అదే సమయంలో బోరిస్ జాన్సన్ లాంటి వాళ్ళు ఉక్రెయిన్ లోకి వచ్చి మళ్లీ రష్యా కు వార్నింగ్ ఇస్తూ ఉండడం సంచులనంగా మారిపోయింది. దీంతో అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆపరేషన్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు అనే విషయం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఉక్రెయిన్ పై ఆపరేషన్ కోసం స్పెషల్ కమాండర్ ని రంగంలోకి దింపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. రష్యన్ ఆర్మీ జనరల్ అలెగ్జాండర్ డోరిఫ్ హోలీ ఉక్రెయిన్ పై ఆపరేషన్ కోసం   నియమించారు. ఇతను ఒకరకంగా ఉక్రెయిన్ బాధితులు కావడం గమనార్హం. ఇక ఈయన కుటుంబం మొత్తం గతంలో ఉక్రెయిన్ లో జరిగినటువంటి పలు ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ప్రాణాలు కోల్పోయినా పరిస్థితి  ఇలా ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఇక ఆపరేషన్ అప్పగించాడు పుతిన్. దీంతో రెండు రోజులు ఉక్రెయిన్ పై దాడి మళ్లీ ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: