కానీ ఇక్కడ మాత్రం ఏకంగా మనిషి ఒక కుక్కను కరిచాడు. దీంతో ఈ ఘటన కాస్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అమెరికాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఒక దొంగ మంచి టైం చూసుకుని వృద్ధులు ఉన్న ఇంటికి కన్నం వేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం పూర్తి చేసి బయటకు వెళ్లేందుకు వచ్చాడు. ఇక అదే సమయంలో ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తాను పారిపోయేందుకు డెలివరీ ట్రక్ ఇవ్వాలని లేదంటే ప్రాణాలు తీస్తాను అంటూ డెలివరీ బాయ్ ని హెచ్చరించాడు సదరు దొంగ. కాగా డెలివరీ బాయ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఇక నిమిషాల్లో పోలీసులు ఆ ఇంటిని మొత్తం చుట్టుముట్టారు. కానీ ఎంత ప్రయత్నించినా దొంగను మాత్రం అక్కడి నుంచి బయటకు రప్పించలేకపోయారు. దీంతో ఒక పోలీసు జాగిలంను ఇంట్లోకి వదిలారు.. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏకంగా ఆ దొంగ కుక్కను కరిచి పొడిచి పారిపోవాలని ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కుక్క తో పాటు అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం గమనార్హం. సదరు దొంగపై పాత కేసులు ఉన్నాయి చెప్పిన పోలీసులు ఇక ఇప్పుడు మరో కేసు నమోదు చేశారు..