సాధారణంగా జాబ్ అనగానే ప్రతి రోజూ ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళటం.. అక్కడ ఎంతో కష్టపడి పని చేయడం. ఇక ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రావడం తినడం పడుకోవడం.. మళ్లీ పొద్దున్నే లేచి జాబ్ కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉండాలి అనే విషయం తెలిసిందే. ఇక ఏ జాబ్ లో అయినా ఇలాంటిది తప్పనిసరిగా ఉంటుంది. కానీ హాయిగా నిద్రపోతే కూడా ఊహించని రేంజిలో సాలరీ చెల్లిస్తున్నారు అంటే అలాంటి జాబ్ వదులుకోవడానికి ఎవరు ఊరుకోరు. అంతేకాదండోయ్ అలాంటి జాబ్ సంపాదించడానికి అందరూ ఎగబడి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడు నిద్రపోతూ కూడా డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పాలి.



 సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎంతో మందికి ఇన్కమ్ సోర్స్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సరి కొత్తగా ట్రై చేయడం డబ్బులు సంపాదించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ అయిన  జాకీ బూమ్ తాను నిద్రపోతూ దాదాపు నెల ఇరవై ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే అతను నిద్రపోతున్న సమయంలో ఎవరైనా సరే అతన్ని నిద్ర లేపవచ్చు. అలా లేపితే అప్పుడు అతనికి డబ్బు ఇవ్వాలి. ఈ క్రమంలోనే ప్రపంచంలోని ఎక్కడెక్కడి వారో జాకిని డిస్టర్బ్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు. ఈ ప్లాన్ కోసం జాకి తన బెడ్ రూంలో లేజర్లు స్పీకర్లు బబుల్ మెషిన్ అలారం ఇంకా చాలానే ఉన్నాయ్.


 ఇలాంటివి ఉంటే ఎవరికైనా సరే సరిగ్గా నిద్ర పట్టదు అని అనుకుంటారు. అయితే ఒక వీడియోలో 12:30 గంటలకు అతన్ని ఎవరో.. లేరు. ఈ వీడియో దాదాపు 70 లక్షల మందికి పైగా చూశారు. మరో వీడియో లో రాత్రి 2 గంటలకు గదిలోని స్పీకర్ లలో ఒక శబ్దం వచ్చింది. అయితే 28 ఏళ్ల యువకుడు  జాకీ ఏడు గంటలు నిద్రపోవడం  ఇష్టం. ఇక తనకు వస్తున్న డబ్బులతో అతను మరిన్ని సౌండ్స్ తో తన గదిలో సెట్ చేస్తా అని చెబుతున్నాడు. తద్వారా మరింత ఎక్కువగా థ్రిల్ పొందవచ్చని చెబుతున్నారు. అయితే అంతా బానే ఉంది కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు. ఇతనికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్రేం ఒక రేంజ్లో  ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: