ఇటీవల కాలంలో మనుషులందరూ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.. ఇలా నిర్లక్ష్యంగా కొంతమంది చేస్తున్న పనులు ఇతరుల పాలిట శాపంగా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రదేశాలలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఇష్టానుసారంగా ప్రవర్తించడం కారణంగా ఇక ఎంతోమంది జీవితాలు కూడా ప్రమాదంలో పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘాటనే జరిగింది. ఇటీవల కాలంలో సిగరెట్ తాగడం ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా సిగరెట్ తాగుతూ ఉన్నారు.


 కొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వడానికి సిగరెట్ తాగుతూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం ఏదో అనుభూతి వస్తుంది అనే ఊహలో సిగరెట్ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. సరే పోనీలెండి వాళ్ళ డబ్బులతో వాళ్ళ సిగరెట్ తాగుతున్నారు మనకెందుకులే అంటారా.. ఇక సిగరెట్ తాగడం తాగకపోవడం వాళ్ల ఇష్టం కానీ.. సిగరెట్ తాగడం వల్ల ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇలాంటిదే చేశాడు.


 విమానంలో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి ఎంతో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఏకంగా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే విధంగా వ్యవహరించాడు. ఫ్లైట్లో సిగరెట్ తాగి ఏకంగా టాయిలెట్ నే తగలబెట్టాడు. ఈ ఘటన బ్యాంకాక్ విమానంలో వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయిల్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఒక వ్యక్తి టాయిలెట్లో సిగరెట్ తాగి డస్ట్ బిన్ లో పడేసాడు. అయితే డస్ట్ బిన్ లో టిష్యూ పేపర్ లు ఉండడంతో వాటికి నిప్పు అంటుకుంది. దీంతో విమానం గాల్లో ఉండగా టాయిలెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది  మంటలు ఆర్పేశారు. ఇక విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: