
ఈ క్రమంలోనే అక్కడ రోజురోజుకి పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం చేసుకోవడానికి పని లేక తినడానికి తిండి లేక అక్కడి ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఏకంగా కుటుంబాన్ని పోషించడం కోసం కొంతమంది.. ఏకంగా తమ కిడ్నీలను కూడా అమ్ముకుంటున్న దీనస్థితి ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఇంత జరుగుతున్న అక్కడి ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తూ ఉంది. ప్రజలను బానిసలుగా మార్చి చిత్రహింసలకు గురిచేస్తుంది అని చెప్పాలి.
అయితే ఆఫ్గనిస్తాన్ లో పాలన తాళిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయి అనే విషయంపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రమేష్ కీలక విషయాలను వెల్లడించారు అని చెప్పాలి. గత 18 రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా ఉపాధి కోల్పోయారు అన్న విషయాన్ని ఆయన చెప్పుకోచ్చారు. ఆఫ్గనిస్తాన్ లో 65% మందికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపారు. అంతేకాదు ఇక అక్కడ నిత్యవసరలా సరుకుల ధరలు 30% పెరిగాయని.. ఇక 60 లక్షల మంది ఆహారం లేక అల్లాడిపోతున్నారు అన్న విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు వస్తున్న ఆదాయంలో మూడు వంతులు కూడా కేవలం ఆహారంకి మాత్రమే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.