ఈ సృష్టిలో దయ్యాలు భూతాలు అనేవి ఉన్నాయా.. అంటే శాస్త్రవేత్తలు లేవు అని చెబుతారు. కానీ సాధారణ  జనాలు దయాలు భూతాలు లాంటివి ఉన్నాయి అని నమ్ముతూ ఉంటారు. కానీ నిజంగా ఉన్నాయి అన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే లేవు అన్న దానికి కూడా ఆధారాలు లేవు. అయితే మనుషులతో పోల్చి చూస్తే అటు జంతువులు ఇక దయ్యాలు భూతాలను ఎంతో వేగంగా పసిగడతాయని అంటూ ఉంటారు చాలామంది పెద్దలు. ముఖ్యంగా కుక్క పిల్లి లాంటి జంతువులకు అయితే  రాత్రిపూట కూడా దయ్యాల భూతాలు స్పష్టంగా కనిపిస్తాయని చెబుతూ ఉంటారు.


 అయితే కేవలం దయ్యాలు మాత్రమే కాదండోయ్ ఇక ప్రకృతి విపత్తులను కూడా మనుషులతో పోల్చి చూస్తే జంతువులు ముందుగానే గ్రహించి అక్కడి నుంచి తప్పించుకోగలవు అని శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇలాంటి ఒక జంతువు గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా మనిషి పుట్టుక గురించి అందరికీ తెలుస్తుంది.  కానీ మరణం ఎప్పుడు సంభవిస్తుంది అన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. మరణాన్ని ముందుగా ఊహించడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పిల్లి మాత్రం మరణాన్ని ముందుగానే అంచనా వేస్తుంది.


 అమెరికాకు చెందిన ఆస్కార్ అనే పిల్లి ఏంజెల్ ఆఫ్ డెత్ గా పాపులర్ అయింది. 2005లో ఈ పిల్లిని ఓ నర్సింగ్ హోమ్ సిబ్బంది చేరదీసారూ. అయితే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే ఈ పిల్లి ఎవరి దగ్గరకైనా చేరింది అంటే చాలు వాళ్ళు త్వరలో చనిపోతారని సంకేతమట. మొదట దీనిని గురించి అంతగా పట్టించుకోలేదు సిబ్బంది. కానీ తరచూ ఇదే రిపీట్ అవుతూ ఉండడంతో ఈ పిల్లికి ఏదో స్పెషల్ పవర్స్ ఉన్నాయని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. 2022 వరకు జీవించిన ఈ పిల్లి దాదాపు వందమందికి పైగా చావులను ముందుగానే పసిగట్టిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat