ఇక ఈ భూమి మీద నూకలు తినే బాకీ లేనప్పుడు ఎవరైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అది ఏదో ఒక విధంగా జరిగిపోతుంది అన్నదానికి నిదర్శనంగా ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్స్ కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇలాంటివి చూసి ప్రతి ఒక్కరిలో ప్రాణాలపై తీపి పెరుగుతుంది అని చెప్పాలి అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచిత్రమైనది. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సాలీడులు ఉండడం కామన్. కానీ ఆ సాలీడుల కారణంగానే ప్రాణం పోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా..
కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. బ్రెజిలియన్ సింగర్ అయినా 28 ఏళ్ల డార్లింగ్ మొరైన్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మొఖంపై సాలీడు కుట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ఇక అలర్జిక్ రియాక్షన్ తో చనిపోయాడు. ఈ విషయాన్ని అతని భార్య జుల్లెన్ని వెల్లడించారు. అయితే సాలీడు కుట్టినచోట.. చర్మం నల్లగా మారిపోయిందని ఆమె తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ సింగర్ సవతి తల్లి కూతురు కూడా ఇలాగే సాలీడు కుట్టడంతో ప్రాణాలు కోల్పోయింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి