ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ కు సంబంధించిన వార్త గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హోటల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఏకంగా ఐదు అంతస్తులు ఉన్న అతి చిన్న హోటల్ అది. ఐదు అంతస్తులు అంటున్నారు అతి చిన్న హోటల్ అంటున్నారు అదెలా కుదురుతుంది అంటారా.. వాస్తవానికి నిజంగానే ఆ హోటల్ ఐదు అంతస్తులో ఉంది. కానీ కేవలం 9 అడుగుల వెడల్పుల్లో మాత్రమే ఆ హోటల్ ఉంది. ఇక ఆ హోటల్లో ఏడు గదులు మాత్రమే ఉన్నాయి. చూడ్డానికి ఏకంగా అగ్గిపెట్ట మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది ఆ హోటల్.
ఇలా తొమ్మిది అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ఐదు అంతస్తుల హోటల్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. అయితే ఈ హోటల్లో మొత్తంగా ఏడు గదులు ఉండగా.. ఇక అన్ని గదుల్లో కూడా ఇక సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయట. హోటల్ పై భాగంలో రెస్టారెంట్ కూడా ఉంటుందట. ఈ భవన నిర్మాణం కోసం ఎంతో శ్రమించిఇంజనీర్లు డిజైన్ రూపొందించారు. ఇక ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్ గా పేరుగాంచింది. ఈ విచిత్రమైన హోటల్ ఫోటోలను చూసి నేటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇండోనేషియాలోని సలాటి పట్టణంలో ఈ హోటల్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి