గతంలో గుణాత్మకమైన విద్య అందేది. విజ్ఞానానికి సమాజ అవగాహనకు విద్యా బోధనలో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం  ఆ పరిస్థితి లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా చేసుకొని ఆన్ లైన్ బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ పెట్టి పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి నెలకొంది.


కిలోల, లీటర్ల లెక్కలు తెలుసుకోలేకపోతున్నారు. చిన్న చిన్న లెక్కలకు సైతం క్యాలిక్యులేటర్లు వినియోగిస్తున్నారు. చివరకు టైమ్ చెప్పేందుకు కూడా గడియారాలు కాకుండా.. సెల్ ఫోన్ పైనే ఆధారపడుతన్నారు. కార్పొరేట్ చదువులు చదువుతున్న ఓ విద్యార్థిని పట్టుకొని ఆయా కోర్సులకు సంబంధించినది కాకుండా భారత దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే చెప్పలేరు. రాజ్యాంగం అంటే తెలయదు. ముఖ్యంగా మాతృభాష పై కమాండ్ ఉండదు. పుస్తకాల్లో ఉన్న విషయాలు తప్ప విషయ పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది.


ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినాయిస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా వాళ్ల సర్వే లెక్కలు చూసుకుంటే మొత్తం 30 స్కూళ్లను వాళ్లు తనిఖీ చేశారు. అందులో సరిగ్గా పాఠ్యాంశాలు చెప్పగలిగిన వాళ్లు సున్నా అంట. స్కూల్ ఎన్ రోల్ మెంట్ లెక్కలు ఇవన్నీ చూస్తే.. స్కూళ్లకు ఎక్కువ ఫీజులు ఖర్ఛు పెట్టినా సరే సరైన విద్య లభించడం లేదు.  పదో తరగతి చదివే విద్యార్థి రెండో తరగతి, మూడో తరగతి పాఠ్యాంశాలు కూడా చదవ లేకపోతున్నారు.


మన దేశంలో కూడా విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగానే  ఉన్నాయి. ఈ మేరకు బయాండ్ బేసిక్స్ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాక్యాలను చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa