నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశైలిలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రతి పనిని కూడా సులభతరం చేసేస్తూ ఉన్నాయి. అయితే ఇలా టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు కూడా తెరమీదికి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో టెక్నాలజీతో మనిషి జీవనశైలి కాస్త సులభతరంగా మారిపోయినప్పటికీ ఇదే టెక్నాలజీ మనిషి మనుగడను  ప్రమాదంలో కూడా పడేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన రోబోలు మనుషులు చేయాల్సిన అన్ని పనులను కూడా చేసేస్తూ ఉన్నాయి.


 దీంతో రానున్న రోజుల్లో ఇక ఏ ఉద్యోగంలో కూడా మనుషుల అవసరం ఉండే అవకాశం లేదేమో అనేంతలా పరిస్థితులు క్రమక్రమంగా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ప్రాముఖ్యత అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  అయితే కేవలం ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఇక మరిన్ని ప్రమాదాలు కూడా ముంచుకు వస్తున్నాయి అన్నది తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఏకంగా పురుషులకు కూడా ముప్పు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే చైనాలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా మారిపోతున్నాయి.


 సాధారణంగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం చూస్తూ ఉంటాం. ఇక ఒకరి భావాలను మరొకరు పంచుకుంటూ ఉంటారు  కానీ చైనాలో మాత్రం ఇలా జరగడం లేదు. ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ టెక్నాలజీతో తయారైన బాయ్ ఫ్రెండ్స్ ని చైనాలోని అమ్మాయిలందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రధానంగా చైనాలోని గ్లో అనే చాట్ బోట్ యాప్ లో ఇది ఎక్కువగా నడుస్తుందట. నిజమైన పురుషుల కంటే ఇలా చాట్ బోట్ తోనే ప్రేమ బాగుందని తమ భావాలను బాగా అర్థం చేసుకుంటున్నారని.. తాము చెప్పినట్లు వింటున్నారూ అంటూ అక్కడ యువతులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: