ఈ మధ్యకాలంలో జనాలు అందరూ కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో కాలం గడిపేస్తున్నారు. అయితే నేటి రోజుల్లో ప్రతి పనిని సోషల్ మీడియాలోనే చేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే కావాల్సిన వస్తువులు అన్నింటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కూర్చున్న చోటుకు తెప్పించుకుంటున్నారు.


 చివరికి పెళ్లి తంతుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇంటర్నెట్ లోనే పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఇక వరుడు కుటుంబ సభ్యులు వధువు ఇంటికి పెళ్లిచూపుల కోసం వెళ్లడం ఇక ఇలా పెళ్లి చూపులకు వెళ్లి ఇక కట్న కానుకలు మాట్లాడుకోవడం చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం మ్యాట్రిమోనీ సైట్లలోనే పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎంతోమంది తల్లిదండ్రులు తమ కూతురుకి లేదా కొడుకుకి ఇక పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేయడం నేటి రోజుల్లో సర్వసాధారణంగానే మారిపోయింది. అయితే ఇక్కడ ఒక తండ్రి ఇలాగే తన కూతురు కోసం వరుడు కావాలంటూ ప్రకటన చేశాడు.


 దీంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అదేంటి వరుడు కావాలంటూ ప్రకటన చేస్తే అందులో షాకింగ్ ఏముంది అనుకుంటున్నారు కదా.. సదరు వ్యక్తి తన చనిపోయిన కూతురికి వరుడు కావాలి అంటూ ప్రకటన చేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఇలా చనిపోయిన తమ కూతురికి పెళ్లి చేసేందుకు 30 ఏళ్ల క్రితం మరణించిన వరుడు కావాలి అంటూ ఓ కుటుంబం పత్రిక ప్రకటన చేసింది. 30  ఏళ్ళ క్రితం పసికందుగా ఉన్న తమ కూతురు మరణించింది అని..  అప్పటి నుంచి తాము తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నామని.. ఆ కుటుంబం తెలిపింది. అందుకే పెద్దలు సూచనతో తమ కూతురి ఆత్మకు శాంతి కలగాలని ఉద్దేశంతో.. పెళ్లి చేయాలని నిశ్చయించి ఇలా 30 ఏళ్ల క్రితం చనిపోయిన వరుడు కావాలంటూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: