ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఎప్పుడు పక్కదారులు తొక్కుతూ ఉంటుంది చైనా. అదే సమయంలో ఇక పొరుగున ఉన్న దేశాల సరిహద్దులను ఆక్రమించుకునేందుకు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక చైనా పొరుగున ఉన్న తైవాన్ దేశాన్ని కూడా తమ దేశంలో భాగమే అంటూ చెప్పుకుంటూ ఉంటుంది. అందుకే గత కొంతకాలం నుంచి చైనా తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి.


 ఇరుదేశాలు కూడా సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని ఆయుధాలను మొహరించడం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే చైనా తైవాన్ మధ్య యుద్ధం జరిగితే.. ఇక ప్రపంచ దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే తైవాన్ చైనాలో భాగం కాదు అంటూ అగ్ర దేశమైన అమెరికా సైతం చిన్న దేశమైన తైవాన్ కు మద్దతుగా నిలిచింది. ఈ విషయంపై అటు చైనా అమెరికా మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగాయి అని చెప్పాలి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య తైవాన్ ఇటీవల ట్విస్ట్ ఇచ్చింది.


 తమది ప్రత్యేక దేశమని చైనాలో కలిసే ప్రసక్తే లేదు అంటూ మొన్నటి వరకు తైవాన్ అధ్యక్షుడు చెప్పగా.. ఇప్పుడు చైనా విషయంలో తైవాన్ దూకుడు తగ్గించింది. ఆ దేశం నూతన అధ్యక్షుడు లాయ్ జింగ్ తే ఇటీవల చేసిన ప్రసంగంలో చైనాపై విరుచుకుపడ్డారు. దీంతో తైవాన్ చుట్టూ బీజింగ్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు లాయ్ వెనక్కి తాగ్గారు. మాకు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకం. అందుకోసం చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావాలి అంటూ లాయ్ ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: