చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది పరామర్శలే.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం మధ్య ఉండటం చంద్రబాబు పాలసీ.. తనలాగానే పార్టీ నాయకులనూ పరుగులు పెట్టిస్తారు. రోజుకు 16 గంటలకుపైగా పని చేసే సీఎం చంద్రబాబు మాత్రమేనని పసుపు కండువాలు గర్వంగా చెప్పుకుంటాయి. నిత్యం పర్యటనలు, రివ్యూలు, మీటింగులు ఇదే చంద్రబాబు జీవితం. 

మరి అలాంటి చంద్రబాబు బిజీ లైఫ్ లో ఇంకో కొత్త కోణం కూడా ఉంది. ఎప్పుడూ రాజకీయాలు, పని, ఇంతేనా.. జీవితంలో ఆటలు, యోగా, డాన్స్ కూడా ముఖ్యమేనంటున్నారు ఆంధ్రాసీఎం చంద్రబాబు. గ్రామీణ భారతంలో ఆటలకు ప్రాధాన్యత ఉన్నా.. ప్రస్తుత సమాజంలో ఆటలకు ప్రాధాన్యం తగ్గిపోయిందని ఆయన ఆవేదన చెందారు కూడా. ఆనందదాయకమైన సమాజ ఆవిర్భావం కోసం ఫిజికల్ లిటరసీని ఒక ప్రజాఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాల్సివున్నదంటున్నారు చంద్రబాబు. 

బాబు.. కొత్త గేమ్స్.. 


అందుకే ఫిజికిల్ లిటరసీ కోసం క్రీడాశాఖ దీనిపై తక్షణం ఒక కార్యాచరణ రూపొందించాలని, ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ దీనిపై చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఫిజికల్ లిటరసీ కార్యక్రమంపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. చదువుతో పాటు కళలు, క్రీడలు కూడా సమాజానికి ముఖ్యమని.. వాటి ద్వారా పిల్లలు, ప్రజలలో ఆసక్తి పెంచేందుకు ప్రయత్నించాలని బాబు చెబుతున్నారు. 

రాష్ట్ర క్రీడావిభాగం, విద్యాశాఖతో సమన్వయం చేసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే ఫిజికల్ లిటరసీని గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. స్థానిక సంప్రదాయ క్రీడలైన కోకో, కబడ్డీ, బిళ్ళంగోడు, ఏడు పెంకులు, వాలీబాల్ తదితర గ్రామీణ క్రీడలకు ఆదరణ కల్పించాలని, దాంతోపాటే కూచిపూడి, యోగా, మెడిటేషన్ లాంటి మానిసికోల్లాస అంశాలను చేర్చాలని చంద్రబాబు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: