బీహార్ లో బీజేపీ నేతలు అనుకున్నది అనుకున్నట్టు పూర్తి చేసేశారు.. రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రాకపోయినా తామే రాజ్యాధికారాన్ని చెలాయించే స్థితికి చేరుకున్నారు. అన్నిటికీ మించి తమకు రాజకీయ శత్రువులుగా ఉన్న ఇద్దరు మిత్రులను విడదీయడంలో సక్సెస్ అయ్యారు.. మరి బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..? వచ్చే ఎన్నికలకోసం బీజేపీ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమైందా.. ?

 Image result for bjp bihar

కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వస్తున్న బీజేపీ తాజాగా బీహార్ లో తాను అనుకున్నది సాధించుకుంది. ప్రజాభీష్టం లేకపోయినా తామంటేనే మండిపడే ఇద్దరు మిత్రులను.. శత్రవులుగా మార్చి అధికార పీఠానికి చేరువైంది. ఐదింట ఒక వంతు స్ధానాలే ఉన్నా నితీష్ కు దగ్గరై అధికారంలో పాలు పంచుకుంది.

Image result for bjp bihar

వాస్తవానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కమార్ కు, ప్రధాని మోదీకి సైద్ధాంతికపరమైన విభేధాలున్నాయి. NDA కూటమి ప్రధాని అభ్యర్ధిగా మోదీ పేరును ప్రకటించడాన్ని నిరసిస్తూ నితీష్  వైదొలిగారు. మోదీని దెబ్బతీసేందుకు తాను రాజకీయ శత్రువుగా భావించే లాలూతో జత కట్టారు. వరుసగా విజయాలతో దూసుకొస్తున్న మోదీకి తొలిసారిగా అపజయం ఏంటో రుచి చూపించారు. అయితే ఇవన్నీ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. లాలుతో జతకట్టిన నితీష్  రెండేళ్లు కూడా తిరక్కుండానే బీజేపీకి దగ్గరయ్యారు. ప్రధాని పదవికి అర్హుడు కాదంటూ విమర్శలు గుప్పించిన మోదీ పాలనపైనే ప్రశంసలు కురపించారు. అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన లాలూకు ఊహించని షాకిస్తూ కూటమి నుంచి తాను వైదొలిగి... అధికారానికి లాలు ప్రసాద్ యాదవ్ ను దూరం చేశారు.

Image result for bjp bihar

బీజేపీ హైకమాండ్ పక్కా వ్యూహం ప్రకారమే బీహార్ రాజకీయం నడిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాశ్వత అధికారమే ధ్యేయంగా సాగుతున్న మోదీ-షా ద్వయం భవిష్యత్ లో తమకు పోటీగా వచ్చే కూటములను విచ్ఛిన్నం చేసేందుకే ఇలా చేసినట్టు భావిస్తున్నారు. గతంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో లాలు తీసుకున్న నిర్ణయాలపై అవినీతి ఆరోపణలు చేయడం.. వాటి ఆధారంగానే ఆయన కుటుంబ సభ్యులపై నితీష్ విమర్శలు చేయడం ... మంత్రి వర్గం నుంచి తేజస్వి యాదవ్ వైదొలగాలని సూచించడం ... లాలు ససేమిరా అనడం ... లాలూచీ పడలేనంటూ నితీష్ వెళ్లిపోవడం ఇందులో భాగమే..!

Image result for bjp bihar

బీహార్ లో పాగా వేయడం ద్వారా బీజేపీ నేతలు రెండు స్పష్టమైన సందేశాలిచ్చారు. దేశంలో తమకు వ్యతిరేకంగా కొత్త కూటములు రాకుండా చూడటం ఒకటైతే .... కాంగ్రెస్ ముక్త్ భారత్ లో భాగంగా ఆ పార్టీకి మిత్రులను దూరం చేయడం రెండోది. బీహార్ ఎపిసోడ్ లో ఈ రెండు విషయాలు బీజేపీ నేతలకు పక్కాగా వర్కవుట్ అయ్యాయానే చెప్పాలి.

Image result for bjp bihar

అయితే.. నితీశ్ బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారనేవారూ లేకపోలేదు. నితీశ్ కు మున్ముందు ముసళ్ల పండగ తప్పదంటున్నారు. నితీష్ వైఖరిని జీర్ణించుకోలేని JDU అధినేత శరద్ యాదవ్ సొంత పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను నమ్మించి మోసం చేసిన నితీష్ పై అదను చూసి పంజా విసరాలని లాలు కూడా భావిస్తున్నారు. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైతం నితీష్  వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు తాను సీఎం కుర్చీలో ఉండాలంటే నితీష్ కు బీజేపీ అవసరం చాలా ఉంది. ఇప్పుడీ బలహీనతనే బీజేపీ తన బలంగా భావిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో తమ భాగస్వామ్యం ఉండాలని బీజేపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు నితీష్ ను దింపే ఆలోచన లేకపోయినా లాలూ ప్రసాద్ యాదవ్ ను పూర్తిగా బలహీనపర్చాక ... తాము పుంజుకున్నామని భావిస్తే కమలనాధులు నితీశ్ కు చెక్ పెట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. అలాంటి పరిస్థితులే వస్తే నితీష్ కు అండగా నిలిచే పక్షాలు దాదాపు లేన్నట్టే.

Image result for bjp bihar

తమ వ్యూహంతో నితీశ్ ను ఒంటరి చేసిన బీజేపీ నేతలు... మరో ప్రత్యామ్నాయం రూపుదిద్దుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే బీహార్ రాజకీయ బీష్ముడిగా గుర్తింపు పొందిన నితీష్ ... లాలును విడిచి బీజేపీతో జట్టుకట్డడం వ్యూహాత్మక తప్పదంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఉన్న స్నేహితుడిని వెళ్గగొట్టి శత్రువును ఇంటికి తెచ్చుకున్నట్టుగా నితీష్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేస్తున్నారు.

Image result for bjp bihar

ఎవరి వాదన ఎలా ఉన్నా బీహార్ లో తాము బలపడేందుకు ప్రస్తుత పరిణామాలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కూటమి విచ్ఛిన్నమై  మధ్యంతర ఎన్నికలు వచ్చినా... సార్వత్రిక ఎన్నికలు జరిగినా కాషాయం జెండా ఎగురవేస్తామనే ధీమా వారిలో కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: