నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ చాలా వీక్ గా ఉంది. 2014 ఎన్నికల్లో మొత్తం పది నియోజక వర్గాల్లో కేవలం టీడీపీ మూడంటే మూడే స్థానాలను గెలుచుకోగలిగింది. దీనితో అక్కడ వైస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తుంది. తరువాత జరిగిన పరిణామాల్లో చాలా మంది ముఖ్య నేతలు ఎస్సార్పీసీ లోకి చేరడం జరిగింది. దీనితో నెల్లూరు టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైందని చెప్పాలి. 


అయితే వేంకటగిరిలో ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణ కొనసాగుతున్నాడు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి ఎస్సార్పీసీ తరుపున బలమైన నేత అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి భరిలో దిగుతుండటంతో వెంకటగిరిలో పోటా పోటీగా తయారైంది. అయితే వెనకేటగిరి ఎమ్మెల్యే గన్ మెన్ .. ఎవరైతే టీడీపీ నుంచి కార్యకర్తలు వైసీపీ లోకి జంప్ అయ్యారో వారి మీద దాడికి దిగటం కలకలం రేపుతోంది. 


అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్న ప్రకారం వైసీపీ తరుపున ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలు ను ఎమ్మెల్యే గన్ మెన్ ఎందుకు పార్టీ మారారని అడిగి దాడికి దిగారని చెప్పుకొచ్చారు. దీనితో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకు పిర్యాదు చేస్తామని వైస్సార్సీపీ నాయకులూ చెబుతున్నారు. మరి కొంత మంది చెబుతూ టీడీపీ ఎమ్మెల్యే ఓడి పోతున్నాడని తెలిసి ఇలా మా మీదకు దాడికి దిగుతున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: