గత కొన్ని రోజులుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ టిడిపి పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని  ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ ఇప్పుడు వరకు వల్లభనేని వంశీ మాత్రం వైసీపీలోకి చేరలేదు. అంతేకాకుండా తాజాగా వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. ఓ వైపు జగన్ ప్రభుత్వం చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కీలక నిర్ణయాలను పొగుడుతూనే... మరోవైపు చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వల్లభనేని వంశీ.  గత కొన్ని రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. 

 

 

 

 జగన్ సర్కార్  మంచి పని చేస్తుంటే దానికి సమర్తించాలి  కానీ జగన్ అధికారంలోకి వచ్చి మంచి పని చేస్తున్నప్పుడు కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు అని  వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లోనే అన్ని నెరవేర్చారా  అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన స్వగృహంలో టిడిపి సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం లో వల్లభనేని వంశీ ని  టిడిపి ని సస్పెండ్ నిర్ణయించినట్లు సమాచారం. 

 

 

 

 ఇందుకు సంబంధించిన ఆదేశాలు మరికొద్ది గంటల్లో జారీ కానున్నట్లు సమాచారం. వంశి కీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని యోచనలో టిడిపి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా విమర్శించడంతో పాటు లోకేష్ పై కూడా వల్లభనేని వంశీ చేసిన విమర్శలను  టిడిపి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నట్లు సమాచారం . గన్నవరం ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టిడిపి డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వల్లభనేని వంశీ టిడిపి పార్టీని వీడి  వైసీపీలో చేరడం కూడా ఖాయం కావడంతో గన్నవరం టిడిపి ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా టిడిపిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: