దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన దిశా అత్యాచారం హత్య ఘటన. షాద్ నగర్ లోని వెటర్నిటీ వైద్యురాలు దిశను  నలుగురు నిందితులు పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దిశా ఘటనలో  నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి..కాగా  దిశ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పటికీ కూడా ఆడ పిల్లలపై దాడులకు పాల్పడుతున్న వారు వెనుకడుగు వేయడం లేదు. కనీసం వారిలో కొంచెమైనా భయం  కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలో  రాధిక అనే బాలికపై ప్రేమోన్మాది దాడి అతి కిరాతకంగా చంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

 

 ఇక తాజాగా ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్,  నటి విజయశాంతి స్పందించారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా  ఘటన మరవకముందే కరీంనగర్లో రాధిక అనే బాలిక ను అతి కిరాతకంగా హతమార్చారు.. ఇది ఉన్మాదం అంటూ  విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కరీంనగర్ జిల్లాలో రాధిక అనే బాలికపై ప్రేమోన్మాది దాడి చేసి ఆమెను కిరాతకంగా హతమార్చాడం... తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. ఇంట్లో ఉన్న బాలికపై ప్రేమోన్మాది దాడి చేసి విచక్షణ రహితంగా హత్యచేశాడు అంటే మానవత్వం ఎంతలా  మంటగలిసి పోతుందో అర్ధం అవుతుంది. నిందితులకు ఎన్ కౌంటర్లు చేసిన ఉరి శిక్ష వేసిన భయం రావడం లేదు... ఇలాగే కొనసాగితే అరబ్ దేశాల్లో లాగానే...మహిళలపై  దాడులు చేసే వారిని బహిరంగ ఉరి శిక్ష వేయాల్సిన పరిస్థితి వస్తుంది. 


 అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగిన రోజు స్వాతంత్రం వచ్చిన రోజు  మహాత్మా గాంధీ చెప్పారు...కానీ  కరీంనగర్లో ఇంట్లో ఉన్న బాలికకే  రక్షణ కరువైంది. ఈరోజు ఘటనతో సమాజం ఎంత  ప్రమాద స్థితిలో ఉందొ చెప్పటానికి  ఈ ఘటనే నిదర్శనం. అయితే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సోషల్ మీడియా ప్రధాన కారణమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి వాటిపై చర్యలు  తీసుకుంటామని చెప్పారు... అది త్వరగా ఆచరణలో పెడితే మహిళా లోకంపై  జరుగుతున్న నేరాలను అదుపు చేయవచ్చు అని... ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను  అంటూ విజయశాంతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: