ఏపీలో పబ్జి రాజకీయం అంటూ పెద్ద ఎత్తున టిడిపి, వైసిపి నేతల మధ్య వివాదం చెలరేగుతోంది. పబ్జి ఆటగాళ్ళు అనుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఏపీ రాజకీయాలు మరింత హీటేక్కిస్తున్న. జగన్ పబ్జి ఆటగాడని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఇంట్లో కూర్చుని పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు అని టిడిపి తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు చేస్తుండగా, నారా లోకేష్ పబ్జి ప్లేయర్ గా వైసిపి పెద్దఎత్తున విమర్శిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రజలు తీవ్ర విమర్శలపాలు అయ్యేలా చేస్తోంది. ఒకపక్క జనాలు కరోనా విలయతాండవంతో విలవిలలాడుతుంటే, వాళ్ల సంగతి పక్కన పెట్టేసి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 

IHG


తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ పబ్జి ఆటగాడని, పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మరోసారి తెరమీదకు వచ్చింది. టిడిపి, వైసిపి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసలు సమస్యలు గాలికి వదిలేస్తున్నారని అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎవరు పబ్జి గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఇప్పుడు తీర్చాల్సింది ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు. ఈ కష్టకాలంలో ఏపీ ప్రజలను ఆదుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, డిమాండ్ చేయడం వంటి విషయాలపై ఏపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు గాని దృష్టి పెట్టాలి తప్ప, ఇలా పబ్జి పేరుతో విమర్శలు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అయి, ప్రజా సమస్యల ను పట్టించుకోనట్టు గా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 


 ప్రస్తుతం వైసిపి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కరోనా సమయంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఈ సమయంలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వానికి తగిన సలహాలు అందిస్తూ సూచనలు చేయాల్సి ఉన్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, అనవసర వివాదాల జోలికి వెళుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: