నమ్ముకున్న వారిని ఆదరించడం లో వైయస్ జగన్ కుటుంబం తర్వాతే మరెవరైనా అని చాలామంది సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. ఏ విషయంలో అయినా వారిని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం చేయారని చెబుతుంటారు. అదేరీతిలో జగన్ పాదయాత్రలో తన వెంటే ఉంటూ అనేకమంది ప్రజలు జగన్ దగ్గరికి వచ్చి ఇచ్చే విజ్ఞప్తులను స్వీకరిస్తూ దాదాపు పాదయాత్ర మొత్తం జగన్ తో అడుగులో అడుగు వేస్తూ నడిచారు అనంతపురం కి చెందిన హరికృష్ణ. 
IHG

అనంతపురం జిల్లాలో చిన్న పిల్లల క్లినిక్ నడుపుకునే హరికృష్ణ వైయస్ కుటుంబం పై అభిమానంతో జగన్ పాదయాత్రలో మరియు షర్మిల పాదయాత్రలో పాల్గొని అండగా నిలబడ్డారు. కాగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా హరికృష్ణ ని  నియమించడం జరిగింది. కాగా హరికృష్ణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు తన సోషల్ మీడియా కి దృష్టికి నెటిజన్లు తీసుకువచ్చే ప్రతి అంశంపై స్పందిస్తూ ఏదో రీతిలో వారికీ సహాయం అందించేలా హరికృష్ణ వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు హరికృష్ణ స్పందిస్తున్న తీరు కు చేతులెత్తి దండం పెడుతున్నారు. 
IHG's Family | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=Y. S. RAJASEKHARA REDDY' target='_blank' title='ysr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ysr</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALL INDIA NATIONAL CONGRESS' target='_blank' title='congress-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>congress</a> Party

గతంలో లో జగన్ దగ్గరికి వచ్చిన వినతి పత్రాలు ఎలా అయితే హ్యాండిల్ చేయటం జరిగిందో…. సీఎం క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నా గానీ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలపై స్పందిస్తూ అన్ని రకాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి బాధితులకు సహాయం అందేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలను ఆదుకుంటూ అనేక లక్షల మందికి ఆపరేషన్లు చేయిస్తూ, అదే రీతిలో అనేకమంది పసిపిల్లల ప్రాణాలను కాపాడారు. చాలా వరకు పేద వారిని ఆదుకుంటూ హరికృష్ణ ఆగిపోయే గుండెలను ఆదుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: