రోజు రోజుకు మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోతున్న దుర్మార్గులు క్షణకాల సుఖం కోసం వావి వరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి, ఏకంగా  సొంత వారితోనే అక్రమ సంబంధాలకు తెర లేపుతూ... చివరికి బజారున పడి కటకటాల పాలవుతున్నారు. ఇక్కడ ఓ ప్రబుద్ధుడు ఇదే చేశాడు. కూతురిలా చూసుకోవాల్సిన కొడుకు  భార్య పై కన్నేశాడు. ఎలాగైనా కోడలిపై కామ కోరికలు తీర్చుకోవాలని అనుకొన్నాడు. కోడలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.



 చివరికి కొడుకు కళ్లుగప్పి కోడలితో కలిసి పారిపోయిన నీచమైన ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే. పానిపట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి... సొంత కోడలిపై కన్నేసి మాయమాటలు చెప్పి అక్రమ సంబంధానికి తెరలేపాడు. ఏకంగా కొడుకుని మోసం చేస్తూ రహస్యంగా రాసలీలలు కొన సాగిస్తూ ఉండేవాడు. ఇక కొన్ని కొన్ని సార్లు కొడుకు కు నిద్ర మాత్రలు ఇచ్చి మరి రాసలీలలు కొనసాగించేవాడు ఈ ప్రబుద్ధుడు. ఇక ఎక్కడ కొడుకుకు  తెలిసిపోతే తమ మధ్య ఉన్న అక్రమ సంబంధం దూరం అవుతుందేమో అని భయపడి... చివరికి నీచానికి ఒడిగట్టాడు.




 కొడుకు కళ్ళు కప్పి ఏకంగా కోడలితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. కాస్తయినా వెనక ముందు ఆలోచించకుండా  సదరు మహిళ ఏకంగా పది నెలల బిడ్డ తో మామ తో కలిసి వెళ్లి పోయింది. ఇక రాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరు నిద్రలోకి జారుకోగానే   రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఇంటి నుంచి పరారయ్యారు. తర్వాత ఉదయం ఇంట్లో భార్య,  తండ్రి కనిపించకపోవడంతో కంగారుపడిన కొడుకు... ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: