ఎక్కడైనా సరే హిందుత్వం అంటే ముందు బ్రాహ్మణ సామాజిక వర్గమే మన కళ్ళ ముందు ఉంటుంది. దేవుడి సేవలో ఎక్కువగా ఉండేది వాళ్ళే. మిగిలిన వాళ్ళు అందరూ కూడా భక్తులే. ఏడు కొండల వాడి దగ్గరి నుంచి ఇంట్లో పూజ వరకు పూజారి లేనిదే పూజ జరగదు. దేవుడిని ప్రాణ సమానంగా చూస్తారు. ఆ దేవుడు ఈ దేవుడు అనే తేడా లేకుండా స్వామి వారి సేవలో తరిస్తూ ఉంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి బ్రాహ్మణ సమాజానికి...ఏపీలో న్యాయం జరుగుతుందా...?

వాళ్ళు గుండెల్లో పెట్టుకుని కొలిచే స్వామి వారి మీద దాడులు జరుగుతుంటే ఏపీ సర్కార్ చూసి  చూడనట్టుగా వ్యవహరిస్తుంది. రామతీర్ధం ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘటనా స్థలం వద్దకు వెళ్తే రాముల వారికి సేవ చేసే  ఒక పూజారి చేతులు అడ్డం పెట్టుకుని కన్నీరు పెట్టుకున్న ఫోటో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. హిందూ దేశంలో ఈ ఘటన కన్నీరు పెట్టింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు రావడానికి ఆ ఫోటో కూడా కారణం అయింది. సిఎంగా జగన్ ఘోరంగా విఫలం అయ్యారని అన్ని వర్గాలు మండిపడ్డాయి.

అలా చెప్తూ పోతే చాలా మంది పూజారులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏపీలో ఉందనే మాట వాస్తవం. ఒక చర్చి మీద దాడి జరిగితే వెంటనే స్పందించిన జగన్ సర్కార్ నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా వారిలో ఏ మానసిక సమస్యలు ఉన్నట్టుగా చెప్పలేదు. కాని హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మాత్రం మానసిక రోగులు చేస్తున్నారని చెప్తుంది. ఏపీలో బ్రాహ్మణ సమాజం మొత్తం ఇప్పుడు సిఎం జగన్ కు దూరం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  హిందూమతం ప్రమాదంలో పడింది అనే ఆవేదన ఎక్కువగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉంది.

సిఎం గా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతీ సంఘటన మీద కూడా జగన్ కు బాధ్యత ఉంటుంది. కాని నాకు సంబంధం లేదన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రతీసారి విపక్షాల మీద ఆయన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాని నిజమైన దోషులను 90 శాతం ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయింది. పోలీసు విభాగం కూడా ఇప్పుడు దేవాలయాల మీద దాడుల విషయంలో ఘోరంగా విఫలం అవుతుంది. నిత్యం పూజించే స్వామి వారి మీద అరాచక శక్తులు దాడులు చేస్తుంటే బ్రాహ్మణ సామాజిక వర్గం కన్నీరు పెడుతుంది. ఇప్పటికి అయినా సరే జగన్ సర్కార్ చర్యలు చేపట్టి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: