తెలంగాణ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టగల దిట్ట రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగల అతి కొద్ది మంది వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఒకరు. తెలంగాణ ప్రభుత్వంపై వారు అమలు చేస్తున్న వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ధీరోదాత్తుడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. కానీ కాంగ్రెస్ తెలంగాణలో వెనుకబడి ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడని చెప్పాలి.  ఇందులో భాగంగానే ఇటీవల పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని ప్రజలంతా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తో పోల్చారు. గతంలో ఆయన కూడా ఇదే విధంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెరాస ప్రభుత్వం కష్టాల్లో ఉందని తెలుస్తోంది. తాజాగా ఈటెల భూ కబ్జా వ్యవహారమే దీనికి కారణం. ఇప్పుడు ఈటెల రాజేందర్ తన రాజకీయ వ్యూహాలను ఏ దిశగా వేయనున్నారో  అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ కెసిఆర్ మాత్రం ఈటెలను అన్ని విధాలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే హరీష్ రావు హుజూరాబాద్ లో మకాం వేశాడు. తెరాస దృష్టంతా ఇప్పుడు ఈటెల రాజేందర్ పైనే వ్యక్తీకృతమయింది. అయితే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఇరుకున పడడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఈటెల కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ ను దెబ్బ తీయగల సత్తా ఉన్న రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తాడు. అయితే ఈటెల ఏ పార్టీ లో చేరుతారు ? లేదా సొంతంగా పార్టీ పెడతారా ? అన్నది ఇంకా తెలియలేదు. కాబట్టి కొంతకాలం వేచి చూడాలి. కానీ తెరాస ను కేసీఆర్ ను దెబ్బ తీయడానికి ఎవరున్నా లేకపోయినా నిరంతరం తెరాస పతనానికి కృషి చేస్తూనే ఉంటానని గతంలో చాలా సార్లు రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. 

కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ని లైట్ గా తీసుకుంటే మాత్రం ..దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడని రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ ను హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతి రోజూ ఎదో ఒక విధంగా తన వ్యాఖ్యలతో అలెర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కరోనాను నిలువరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతుండటంతో ఇప్పుడే దానికి తగ్గ చర్యలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ వేవ్ ను తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: