ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వంపై దాడి జరుగుతుందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. హిందుత్వం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేని తనంగా వ్యవహరిస్తూ ఇతర మతాలకు ప్రాధాన్యత ఇస్తుందని విమర్శలు వస్తున్నాయి. హిందు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పాదే టార్గెట్ చేస్తున్నాయి. అటు బిజెపి నేతలు కూడా పలు దేవాలయాల మీద జరుగుతున్న దాడులపై కాస్త తీవ్రంగానే స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇకా బిజెపి తో కలిసి వెళ్ళే ఆలోచనలో వెళ్ళే టీడీపీ నేతలు కూడా హిందువులను తమకు దగ్గర చేసుకునే ఆలోచన చేస్తున్నారు.

అందుకే ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసంద సరస్వతి స్వామి తాజాగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హిందూ సంప్రదాయాలను ద్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోంది అని ఆయన విమర్శలు చేసారు. హిందుత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారు? అని ఆయన నిలదీశారు. కరోన అడ్డపెట్టుకొని... వినాయక చవితి పండగను అడ్డుకున్నారు అని ఆయన మండిపడుతూ... మీ నాన్న జయంతి కార్యక్రమాలకు కరోన అడ్డురాలేదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

గణపతి నవ రాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటి? అని ఈ సందర్భంగా నిలదీశారు.  ఏ పీఠాధిపతి పతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో లేని ఆకాంక్షలు ఏపి లో పెట్టడం ఏమిటి? అని ఆయన నిలదీశారు. జెరూసలేంకు సీఎం కుటుంబ సభ్యులతో వెళతారు అని హిందూ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో ఎందుకు వెళ్లడం లేదు? అని నిలదీశారు. హిందుత్వాన్ని జగన్ గౌరవించడం లేదు..ఏపీ ని  క్రీస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారు అని విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలు అనుమతి ఇవ్వండి..లేకపోతే భక్తులు తిరగబడతారు అని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలు పై ఆకాంక్ష  పెడితే...జగన్ రాజగురువు, శారదా పీఠం స్వామీజీ ఎందుకు స్పందించరు? అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap