తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ మరోసారి ప్రారంభం కానున్నాయి.  తెలంగాణశాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా నే  ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు. నాలుగో రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలు విషయంలోకి వెళితే... దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరం లో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడం గా రామప్ప దేవాలయం, హైదరాబాద్ నగరంలో దోమలు ఈగల బెడద, వంతెనల మంజూరు మరియు ఐటిఐ ని షాద్నగర్ కు మార్చడం లాంటి అంశాలపై ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగనుంది. 

ఇక తెలంగాణ శాసన మండలి లో చర్చ కు వచ్చే ప్రశ్నల విషయానికి వస్తే... చెక్ డ్యాంల నిర్మాణం, పూర్వ ఆదిలాబాద్ జి ల్లా  లో దేవాలయాల అభివృద్ధి, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి, ఆరోగ్య శ్రీ కింద బకాయిలు చెల్లింపు, విద్యుత్తు ఉత్పత్తి మరియు వినియోగం, గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపు,  ప్రశ్నోత్తరాల సమయం తర్వాత శాసనమండలి లో తెలంగాణ లో హరిత హారం పై స్వల్పకాలిక చర్చ జరుగ నున్న ట్లు అసెంబ్లీ కార్యదర్శి కీలక ప్రకటన చేశారు.  

శాసన సభ లో ప్రశ్నో త్తరాల సమయం తర్వాత స్వల్ప కాలిక చర్చ లో తెలంగాణ లో మైనార్టీల అభివృద్ధి మరియు హైదరాబాద్ నగరం లో అభివృద్ధి కార్యక్రమాల పై చర్చ జరుగ నుంది.  అలాగే... 2 బిల్లుల ను శాసన సభలో చర్చించి ఆమోదానికి పెట్టను న్నారు.  తెలంగాణ gst సవరణ బిల్లు ను.. సీఎం కేసీఆర్ చర్చించి ఆమోదా నికి పెట్ట నుండగా... తెలంగాణ స్టేట్ ప్రింటింగ్ ఆఫ్ షూటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ టూల్స్ అండ్ ట్రావెల్స్. బిల్ 2021 ను హోంమంత్రి మహమూద్ అలీ చర్చించి ఆమోదానికి పెట్టను న్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: