ఒకప్పుడు ఏవైనా ఆర్థికపరమైన కార్యకలాపాలు జరపాలంటే తప్పనిసరిగా బ్యాంకు కి వెళ్లాల్సిన అవసరం ఉండేది. బ్యాంకుకు వెళితే గానీ పనులు అయ్యేవి కాదు. కానీ నేటి రోజుల్లో అసలు బ్యాంకుతో పనిలేకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చున్న చోటు నుంచి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే టెక్నాలజీ ప్రస్తుతం అందరికీ అందుబాటులో వచ్చింది. కేవలం అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఒక్క క్లిక్ తో ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు నేటి రోజులలో. ఇలా నేటి రోజుల్లో నగదు లావాదేవీల కంటే ఆన్లైన్ పేమెంట్ హవా ఎక్కువైపోయింది. కరోనా వైరస్ సమయంలో అయితే ఈ ఆన్లైన్ పేమెంట్ చేయడం మరింత పెరిగిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు వినియోగదారులు అందరిని ఆకర్షించేందుకు.. ఎంతో సౌకర్యవంతమైన ఆర్థికపరమైన లావాదేవీలు జరుపుకునేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ ఆప్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఆన్లైన్ పేమెంట్ యాప్స్ తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో అన్ని రకాల సంస్థలు కూడా డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు నెంబర్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ గా కొనసాగిన వాట్సాప్ సైతం ప్రస్తుతం ఆర్థిక పరమైన లావాదేవీలు నిర్వహించేందుకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.



 ఈ క్రమంలోనే వాట్సాప్ లో కూడా  ఆన్లైన్ పేమెంట్ యాప్స్ లో జరిపినట్లు గానే యూపీఏ ఆధారిత సేవలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక త్వరలో ఈ సేవలను అందరికీ మరింత దగ్గర చేసేందుకు వినూత్నమైన ఆఫర్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక తమ యూజర్ లందరికీ కూడా ఎంతో అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఇవ్వబోతుందట వాట్సాప్. కొందరు బీటా యూజర్లకు గివ్ క్యాష్ పేరిట ఏకంగా 51 రూపాయలు క్యాష్ బ్యాక్ ప్రదర్శిస్తారట. ఇక నచ్చిన ఐదుగురికి యూపీఐ ద్వారా డబ్బులు పంపితే ఏకంగా 51 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది  ఒక రూపాయి పేమెంట్ చేసినా కూడా ఈ 51 రూపాయి క్యాష్బ్యాక్ వస్తుందట. కాగా ఆన్లైన్ పేమెంట్ ప్రారంభించిన మొదట్లో గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డు రూపంలో క్యాష్ బ్యాక్ ఇచ్చింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: