ఇటీవల కాలంలో భారత రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలే ఎక్కువగా పెరిగి పోయాయి. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మంచి పదవిలో ఉన్నాడు అంటే చాలు ఇక ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు బంధువులు అందరూ కూడా రాజకీయాల వైపు వస్తున్నారు. ప్రజలు కూడా ఇలా రాజకీయ నాయకుల వారసులను  నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది ఒకే కుటుంబానికి చెందిన రాజకీయ నాయకులు ఇక రాజకీయాల్లో వివిధ పదవుల్లో సాగుతూ ఉండడం గమనార్హం.


 ఈ వారసత్వ రాజకీయాలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కెసిఆర్ వారసులుగా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక  అల్లుడు హరీష్ రావు మంత్రి వర్గం లో ఉన్నాడు. కూతురు ఎమ్మెల్సీగా ఎన్నికైంది. ఇలా ఎంతో మంది కెసిఆర్ వారసులు తెలంగాణ రాజకీయాల్లో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. అచ్చం ఇలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు జనతాదళ్ పార్టీ అధినేత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఫ్యామిలీలోని ఎంతో మంది చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం గమనార్హం.


 ఇక ప్రస్తుతం దేవేగౌడ ఫ్యామిలీలో ఏకంగా ఐదు మంది కంటే ఎక్కువ మంది ప్రస్తుతం చట్టసభల్లో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేవేగౌడ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దేవేగౌడ కు ఇద్దరు కొడుకులు రేవన్న, కుమార స్వామి.  ఇద్దరు కొడుకులు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుమారస్వామి భార్య అనిత కూడా ప్రస్తుతం కర్ణాటకలో ఎమ్మెల్యేగా కొనసాగుతోంది.  ఇక ఇటీవలే మరో మనవడు సూరత్ ఏకంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా దేవే గౌడ ఫ్యామిలీకి చెందిన అందరూ కూడా కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో కొనసాగుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: